20 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు అందిస్తూ, శంకుస్థాపన చేసిన ఎంపీ చింతా అనురాధ


 అల్లవరం మండలంలోని మొగళ్లమూరు మరియు అల్లవరం వీరన్నమెరకలో 10 లక్షల చొప్పున ఎంపీ లాడ్స్ నిధులతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులకు మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ శంకుస్థాపన చేసారు. అదే విధంగా తూర్పులంక మరియు గోడి గ్రామాల్లో ONGC వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్,  అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ శంకుస్థాపన చేసారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ బొమ్మి ఇజ్రాయిల్ గారు, ప్రజా ప్రతినిధులు, ONGC అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.