దివ్యాంగుడికి ట్రై సైకిల్ ను అందజేసిన అమలాపురం ఎంపీ చింతా అనురాధ


 ONGC వారి సౌజన్యంతో, అల్లవరం మండలం గోడితిప్ప గ్రామానికి చెందిన కోలా భూషణంకి అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ బ్యాటరీ ట్రై సైకిల్ ను అందజేశారు. 

అనంతరం కోలాభూషణం మాట్లాడుతూ తాను చిన్న ప్రయాణాలు చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నానని తెలియజేయగా తన పరిస్థితిని అర్ధం చేసుకుని ట్రై సైకిల్ ను ఏర్పాటు చేయించిన ఎంపీ కి అలాగే ONGC వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో జున్నూరి బాబీ, వడ్డీ గంగ, వీరయ్య, వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు.