వాకింగ్ చేసేవారు ఈ రూల్స్ తప్పకుండా పాటించాలట. పొరపాట్లు చేయడం వల్ల చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎంటో చూద్దాం.. పార్క్‌లు, ఇంటి బయట తోట, పచ్చని వాతావరణం, సహజ కాంతి ఉండే ప్రదేశాలను వాకింగ్ చేయడానికి ఎంపిక చేసుకోవాలి. నడవడానికి సౌకర్యవంతమైన దుస్తులు, లైట్ వెయిట్ షూస్ ధరించాలి. నడకకు 15 నిమిషాల ముందే నీరు తీసుకోవాలి. నడిచిన తర్వాత శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం వల్ల నొప్పులు, ఎముకల సమస్యలు తగ్గుతాయి.