కాట్రేనికోన మండలం దొంతికుర్రు సమీపంలో పంట కాలువలోకి ఆటో బోల్తా కొట్టింది. పల్లం నుండి దొంతికుర్రు వస్తుండగా ఆటో బ్రేక్ పట్టివేయడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తా కొట్టింది. అసమయంలో సుమారు ఆరుగురు ప్రయాణికులు ఆటోలో వున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు, ప్రయాణికులు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎవరికి ప్రాణ హాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Repoter: Rambabu R