ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగానే ఉంటుందని భద్రాచలం ఏఎస్పి పరితోజ్ పంకజ్ పేర్కొన్నారు. బుధవారం చర్ల మండలంలోని మారుమూల గ్రామమైన కిష్టారంపాడును సందర్శించారు. గ్రామస్తులకు దుప్పట్లు, నిత్యవసరాలు వంటసామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ అన్ని వేళలా ఆదివాసీలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు టివిఆర్ సూరి, నర్సిరెడ్డి, సిఆర్పిఎఫ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.