రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులు


 దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న 9,000 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటన విడుదల చేసింది. గ్రేడ్‌-1 టెక్నీషియన్‌ (సిగ్నల్‌) పోస్టులు 1,100, గ్రేడ్‌-2 టెక్నీషియన్‌ 7,900 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు, ఎంపిక తదితర వివరాలను త్వరలో విడుదల చేయనున్నది. ఆయా పోస్టులకు ఆన్‌లైన్‌లో మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 8 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు https://indianrailways.gov.in లో చూడాలని కోరింది.