బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్


దేశీయ మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే బియ్యం ధరల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. వ్యాపారులు తగిన ధరలకు అమ్మాలని ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. బాస్మతీయేతర బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చోప్రా కోరారు.