కాంగ్రెస్ తో కలిసి నడవాలనే తెలంగాణలో పోటీకి దిగలేదు : షర్మిల


 కాంగ్రెస్ తో కలిసి నడవాలనే తెలంగాణలో పోటీకి దిగలేదు అని వైఎస్ షర్మిల అన్నారు. ఇడుపులపాయలో ఆమె మీడియాతో మంగళవారం మాట్లాడారు. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 31 స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి మేం పోటీ పెట్టకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నామని, రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తానని ఆమె అన్నారు.