భర్త వీర్యంతో IVF పద్దతిలో పిల్లలను కనాలనుకుంటున్నానని సుప్రీంకోర్టులో ఓ అనూహ్యమైన పిటిషన్ విచారణకు వచ్చింది. పిల్లల్ని కనేవారకు అతను భోపాల్ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై స్టే విధించాలని ఓ 44 ఏళ్ల మహిళ కోరింది. తాను నివాసముంటున్న లక్నోకు కేసు విచారణను బదిలీ చేయాలని కోర్టుకు విన్నవించుకుంది. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు.. 6 వారాల్లో భర్తకు నోటీసులివ్వాలని భోపాల్ కోర్టును ఆదేశించింది.