మకరజ్యోతికి వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్


కేరళలోని శబరిమలలో మండల పూజలు పూర్తికావడంతో అయ్యప్ప ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తిరిగి మకరవిలక్కు కోసం శనివారం ఆలయ ద్వారాలను తెరిచి దర్శనం కల్పించనున్నారు. జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లను 50,000కి తగ్గించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. యాత్రికుల రద్దీని ఊహించి, ముందస్తు బుకింగ్‌లు లేకుండా ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్‌లను 10,000కి పరిమితం చేయనున్నారు.