AP: ఆరోగ్యశ్రీ సేవలు బంద్ నిర్ణ‌యం వాయిదా


 ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కింద కొత్త కేసులను ఈ రోజు నుంచి చూడకూడదన్న నిర్ణయం అమలును మరో 15 రోజులు వాయిదా వేసినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్ల‌డించింది. ఆరోగ్యశ్రీ ప‌థ‌కానికి సంబంధించి పెండింగ్ బకాయిల‌తో పాటు తమ డిమాండ్ల విష‌యంపై త‌ప్పకుండా పరిశీలిస్తామని సర్కార్ తెలప‌డంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.