ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. గత ప్రభుత్వహయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు.