గజ్వేల్ పట్టణంలో బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ సందడి చేశారు. ట్రోఫీతో సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని తన స్వగ్రామం కోల్గూర్ గ్రామానికి బయలుదేరారు. దీంతో పల్లవి ప్రశాంత్ స్నేహితులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జై జవాన్, జై కిసాన్ అంటూ యువకుల నినాదాలు చేశారు.