బీసీ కుల గణనపై ఆర్ఎస్ఎస్ సంచలన ప్రకటన


బీసీ కులగణనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సంచలన ప్రకటన చేసింది. బీసీ కులగణనకు ఆర్ఎస్‌ఎస్ వ్యతిరేకమని ఆ సంస్థ ప్రకటించింది. బీసీ కుల గణన వల్ల దేశంలో ప్రజల మధ్య అసమానతలు పెరుగుతాయని ఆర్ఎస్ఎస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. బీసీ కుల గణన వల్ల బలహీన వర్గాలకు ఎలాంటి లాభం జరగదని పేర్కొన్నారు. కాగా దేశంలో హాట్ టాపిక్‌గా మారిన కులగణనపై ఆర్ఎస్ఎస్ చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.