తెలంగాణ భవన్ అధికారులపై సీఎం రేవంత్ ఫైర్?


సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్ అధికారులను మందలించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు అధికారిక నివాసానికి పెట్టిన నేమ్‌ ప్లేట్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రాసిన తెలంగాణ భవన్ అధికారులు..ఉర్దూని విస్మరించారు. తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ ఉంది. ఈ క్రమంలో ఉర్దూని కూడా కలిపి మరో నేమ్‌ ప్లేట్ బోర్డు తయారు చేయించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి వారిని ఆదేశించారు.