తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకులు పర్యటించనున్నారు. దీనిపై చర్చించేందుకు బండి సంజయ్ తో బీజేపీ సీనియర్ నేత సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఈనెల కేంద్ర మంత్రి అమిత్ షా, ఈనెల 25న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా, 25న నాగర్ కర్నూలులో జరిగే సభలో నడ్డా పాల్గొననున్నారు.