పెళ్లయిన వెంటనే డబ్బులతో పారిపోయిన వధువు


పెళ్లయిన వెంటనే ఓ వధువు డబ్బులు తీసుకుని పారిపోయింది. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని చందౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్వాలి ప్రాంతం కొడారియా గ్రామంలోని ఓ ఆలయంలో తాజాగా వివాహం జరిగింది. అయితే పెళ్లి కాగానే వధువు టాయిలెట్‌కు వెళతానని చెప్పి రూ.80 వేల నగదు, నగలతో ఉడాయించింది. దీంతో వరుడి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న దొంగ వధువు కోసం పోలీసులు గాలిస్తున్నారు.