ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ అలజడి రేపుతోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. చికెన్ దుకాణాలు మూతబడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరిస్తోంది. కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉండే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.