నర్సాపురంలో ఈనాడు రిపోర్టర్ వెంకటేశ్వరరావు పై జరిగిన దాడి సంఘటన పై సోమవారం జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ కు ఎపియూడబ్ల్యూజె ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు విఎస్ సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు కేవీ ప్రసాద్, యూనియన్ నాయకులు కృష్ణమోహన్, ఏబీఎన్ వర్మ, వి. లింగమూర్తి, నూకల సత్యనారాయణ, ఈనాడు కృష్ణ, నిమ్మల ఆది, కృష్ణ, విశాలాంధ్ర రాజశేఖర్, చినబాబు, ఆదిత్య బాబి తదితరులు పాల్గొన్నారు.