ఏపీ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా వాలంటీర్లు కూర్చోవలసిన అవసరం ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు సిస్టం కళాశాల ఆవరణలో జరిగిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేయించడంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలని చెప్పారు.