అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గల ప్రముఖ దేవాలయాలైన శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి దేవాలయం, శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవలయాల్లో జరిగే జాతరాలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సుంచించారు. మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివ, పార్వతులు కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.