ఆలయాలకు యార్లగడ్డ రూ. 3లక్షల విరాళం


 గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని రెండు ఆలయాలకు గన్నవరం నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మూడు లక్షల రూపాయల నగదు విరాళం గా అందచేశారు. గ్రామంలో బుధవారం ఉదయం శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వెంకట్రావ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ అభివృద్ధికి రెండు లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు.