’ఆ సీను చేసేందుకు నా పేరెంట్స్ ఒప్పుకోలేదు‘


 'యానిమల్' మూవీలోని ఇంటిమేట్ సీన్ చేసేందుకు తొలుత తన పేరెంట్స్ అంగీకరించలేదని నటి త్రిప్తి దిమ్రీ తెలిపారు. 'ఆ మూవీలో ఇలాంటి సీన్ ఉందని చెప్పగానే వారు భయపడ్డారు. నా కోసం ఆలోచించే వారు వద్దని చెప్పారు. సినిమా రిలీజ్ తర్వాత నా పాత్రకు మంచి పేరు రావడంతో నా తల్లిదండ్రులు మెచ్చుకున్నారు. నటి అన్నాక అన్ని పాత్రల్లో నటించాలని వారికి తెలియదు' అని ఆమె పేర్కొన్నారు.