కర్నాటకలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా హుక్కా బార్లను నిషేధించనున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ఈ మేరకు 100 మీటర్ల పరిధిలో విద్యాసంస్థలు ఆ ఉత్పత్తులను విక్రయించరాదని సిద్ధరామయ్య ప్రభుత్వం వెల్లడించింది.