అనంతపురంలో ఇప్పటివరకు 120 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. మూడు కోవిడ్ జేఎన్-1 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 26 నుంచి అనంతపురం సర్వజన వైద్యశాలలో కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీనగర్‌లో ఒకరికి, కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్ రాగా, వారు ఆస్పత్రిలో, హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. తాజాగా కొడిమికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.