ఉచిత పథకాలపై ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న ఉచిత పథకాలతో ప్రజల తలరాతలు మారవని అన్నారు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తోన్న ఉచితాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు చైతన్యంతో ముందు వెళ్లాలని.. ఎన్నికల సమయంలో మంచి వ్యక్తికి ఓటు వేయాలని సూచించారు.