‘వ్యూహం’ విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌


 డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌ వేసింది. నేడు (శుక్రవారం) సినిమాను విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 11 వరకు ‘వ్యూహం’ చిత్రం విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. ‘వ్యూహం’ సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలంటూ ఈ నెల 26న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.