దువ్వ2లో ఫ్యామిలీ పిజిషియన్ వైద్యశిబిరం


దువ్వ 2లో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజిషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయిభవాని ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామంలో ఇళ్లవద్దకు వెళ్ళి పలువురు వృద్ధులు, గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ వి దుర్గకుమారి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎలెచ్పి జ్యోతి, ఎంపిహెచ్ఎ వెంకట్రావు, ఏఎన్ఎం లక్ష్మి, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.