చింతలపూడిలో 8వ రోజు అంగన్వాడీల సమ్మె ఉధృతంగా సాగింది. అంగన్వాడీలందరూ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫైర్ స్టేషన్ సెంటర్లో బిక్షాటన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం అంగన్వాడీలపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని, అంగన్వాడీ సెంటర్ల తాళాలు రాత్రుల సమయంలో చట్టవిరుద్ధంగా తాళాలు బద్దలు కొట్టి అక్రమ మార్గంలో సెంటర్లలో ప్రవేశిస్తున్నారని అంగన్వాడి ప్రాజెక్టు యూనియన్ నాయకులు సరోజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.