ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


అనపర్తి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మంగళవారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు.