డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయపరిమితి రూ. 25 లక్షలకు పెంచారని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ప్రతిఇంటికి వెళ్లి ఆరోగ్య శ్రీ పై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ సోమవారం ప్రారంభించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడంపై ప్రచురించిన అవగాహన కరపత్రాలను, ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డులను ఆవిష్కరించామన్నారు.