పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే


పెదవేగి మండలం రాయన్నపాలెంలో సోమవారం దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయ్య చౌదరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 24. 60 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు-నేడు ఫేజ్ 2 కింద 1. 85 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావలి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.