70 శాతం గ్యాస్ స్టేషన్లు మూసివేత.. ఎక్కడంటే..?


ఇరాన్ వ్యాప్తంగా సోమవారం గ్యాస్ స్టేషన్లు మూతపడ్డాయి. ఉదయం నుంచి పనిచేయడం లేదు. సాంకేతిక సమస్య అని చెబుతున్నప్పటికీ.. ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సైబర్ నేరగాళ్ల బృందాలు హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. దేశంలో సుమారు 33వేల గ్యాస్ స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతం 30శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.