నగరాలకు సంబంధించి ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం బెంగళూరు రెండో స్థానం, ఢిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ఓయో తెలిపింది. కాగా రాష్ట్రాల వారీగా ఉత్తర్‌ప్రదేశ్ తొలి స్థానంలో, మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచాయి.