దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దేశంలో కొత్తగా 157 జేఎన్.1 కరోనా వేరియంట్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.