కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలివే.. రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ ALERT


దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 ఉధృతి పెరుగుతోంది. దీని లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం చేయాలి.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. JN.1 వేరియెంట్ కేసులు పెరుగుతుండటంపై అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అలాగే ఆర్టీ పీసీఆర్ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపింది. ఇప్పటికే కేరళలో కొత్త వేరియెంట్ బయటపడగా.. ఈ వేరియెంట్‌తో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులు ఉన్నారు.