20న విజయవాడలో సీఎం జగన్ పర్యటన


సీఎం జగన్ 20వ తేదీ బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. కార్యక్రమం ముగిశాక తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.