భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో 13వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 13 నుంచి 21వ తేదీ వరకు వివిధ అలంకారాల్లో స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 22న స్వామివారికి గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనుండగా హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు. ఈ మేరకు నదిపై హంస వాహనంతో ఆలయ నిర్వాహకులు ట్రయల్ రన్ చేశారు.