లోన్‌ యాప్స్‌‌పై కఠిన చర్యలు- నిర్మల సీతారామన్


ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తన సమాధానంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నిర్మలా సీతారామన్‌ లోన్‌ యాప్స్‌ గురించి పేర్కొన్నారు. ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన లోన్‌ యాప్స్‌ను గూగుల్‌ సంస్థ తొలగిస్తున్నదని తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో ఏకంగా 2,500 మోసపూరిత లోన్ యాప్‌లను గూగుల్‌ తొలగించిందన్నారు.