టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కలిసి విజయవాడలోని గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారికి.. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.