కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన రమణమ్మ హత్య కేసుకు సంబంధించి నేరం జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ మంగళవారం పరిశీలించారు. ముందుగా కొత్తపట్నం పోలీస్ స్టేషన్ లో సంబంధిత పోలీసు అధికారులతో కేసుకు సంబంధించిన విషయాలను ఎస్పీ స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి బాధితులను ఎస్పీ పరామర్శించి త్వరలోనే కేసును చేధిస్తామన్నారు.