2024 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9.12 గంటలకి ప్రారంభమై అర్థరాత్రి 1.25 గంటలకు ముగుస్తుంది. రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడుతుంది. ఆరోజు రాత్రి 9.13 గంటలకి సూర్య గ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 3.17 గంటల వరకు ఉంటుంది. కొత్త ఏడాదిలో పెనుంబ్రా చంద్రగ్రహణం మార్చి 25న వస్తుంది. సెప్టెంబర్ 18న మరో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.