పేదల ఆకలి తీరుస్తున్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్


జగ్గంపేట లోని ఎన్టీఆర్ మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సోమవారం కొత్తూరు బంకు యజమాని కంది తాతాజీ, శ్రీనివాసులు కలిపి భోజన ఏర్పాట్లను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.