జాతీయ స్థాయి శరీర సౌష్టవ పోటీలకు ప్రశాంత్ ఎంపిక


బాడీ బిల్డింగ్ పోటీలో జాతీయ స్థాయికి పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన తనుబుద్ధి ప్రశాంత్ ఎంపికయ్యాడు. సోమవారం తణుకులో జరిగిన 75 కిలోల విభాగంలో శరీర సౌష్టవ పోటీలలో ప్రధమ స్థానం సాధించి బంగారు పథకాన్నికైవసం చేసుకున్నాడు. దీనితో జాతీయ స్థాయిపోటీలకు ఎంపికచేస్తూ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పెద్దాపురంలో హనుమాన్ వ్యాయామశాలకు చెందిన ప్రశాంత్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో అభినందించారు.