ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలోని దక్షిణ మాడవీధిలో ఏర్పాటుచేసిన నిత్య కళారాధన వేదికపై మంగళవారం నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లోక క్షేమాన్ని కాంక్షించడంతోపాటు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పూజ కైంకర్యాలు సజావుగా జరగాలని ప్రతిరోజు నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనవాయతిగా వస్తుంది.