కమ్యూనిటీ హాల్ భవనం నిర్మించాలని కలెక్టర్ కు వినతి


తిరువూరు పట్టణలో మూడు వేల మంది కలిగిన విశ్వబ్రాహ్మణులకు కమ్యూనిటీ భవన నిర్మాణం కొరకు ప్రభుత్వ స్ధలం కేటాయించాలని సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, వైసిపి బి సి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ ఆర్ కె చారి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు