గన్నవరం మండలం అజ్జంపూడి గ్రామానికి చెందిన సీఎస్ఐ చర్చిసంఘానికి చెందిన పెద్దలు గ్రామంలో నూతనంగా చర్చి నిర్మిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకి తెలియజేశారు. యార్లగడ్డ తనవంతు సహాయంగా చర్చి నిర్మాణానికి గాను తనసొంత నిధులు రూ. లక్ష ఆర్థిక సాయంగా పరిశుద్ధ యోహాను సీఎస్ఐ చర్చిసంఘ పెద్దలకు వెంకట్రావు సోమవారం అందించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.