అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక సమ్మె 7 వ రోజుకు చేరిన సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమాని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ, అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.