దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 211 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ 62, రాహుల్ 56 పరుగులతో ఆకట్టుకున్నారు. మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. గైక్వాడ్ 4, తిలక్ వర్మ 10, శాంసన్ 12, రింకు 17, అక్షర్ పటేల్ 7 పరుగులు మాత్రమే చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్ 3, హెండ్రిక్స్ 2, కేశవ్ మహారాజ్ 2, విలియమ్స్, మార్క్రమ్ చెరో వికెట్ తీసుకున్నారు.