అభివృద్ధి పనులకు జగ్గిరెడ్డి శంకుస్థాపన


డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో జరగనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అమలాపురం- బొబ్బర్లంక రహదారికి రావులపాలెం నుండి మెర్లపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పటిష్ఠ పరిచే పనులకు, గడప గడపకు మన ప్రభుత్వం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధులు 1 కోటీ 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.